గమ్యం, నేను, శంభో శివ శంభో, వంటి సీరియస్ క్యారెక్టర్స్ లో నటించి.. నరేష్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కూడా చేయగలడు అని ప్రూవ్ చేసుకొని.. ‘మహర్షి’లో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి అందరిచేత శభాష్ అనిపించుకుని నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగాడు నరేష్. తాజాగా కామెడీ స్టార్ అల్లరి నరేష్ “నాంది” అంటూ మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు.. నాంది ఫంక్షన్ అని. ఎయిర్ పోర్ట్ నుండి రాగానే మా వరు కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని పిలిచింది. ఇక్కడకు వచ్చాక షాకింగ్ గా అనిపించింది. నాంది టీజర్, ట్రైలర్ చూశాను. చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. టీమ్ అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారని తెలుస్తుంది. తెలుగు పరిశ్రమ అంటే నాకు చాలా మక్కువ ఎక్కువ. ఇక్కడ ఆడియెన్స్ ఎంతగానో ఓన్ చేసుకొని ప్రేమిస్తారు. అదే నేను వరలక్ష్మీ కి చెప్పాను. తెలుగులో మంచి సినిమాలు చేయమని సలహా ఇచ్చాను. ఇప్పుడు అలాగే మంచి క్యారెక్టర్స్ చూజ్ చేసుకొని చేస్తుంది. మంచి నటిగా వరు పేరు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. డిఫరెంట్ జోనర్ లో వస్తోన్న నాంది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.