Nag Aswin : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ ల్సిట్ లో మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపుకు తిప్పుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కేస్తున్న సినిమా కూడా ఒకటి. హీరోయిన్ సావిత్రి జీవితాన్ని ఈతరం సినీ ప్రియులకు కళ్లకు కట్టినట్లుగా చూపించారు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాని ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నప్పటికి ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ప్రాజెక్ట్ కె అలస్యం కావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఇది సాధారణ సినిమా కాదని… ఇప్పటి వరకు ఇలాంటి చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడలేదన్నారు. ఇది చాలా కొత్త సినిమా అలాగే స్క్రిప్ట్ కూడా కొత్తది. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచం అన్నారు.
టెక్నీషియన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఒక రకంగా ఈ సినిమా ఎలా చేయాలని ఆలోచించడానికే చాలా సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారు చేయాలి. మహానటి సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం. కానీ ఈ చిత్రానికి అలా కుదరదు. అన్నీ మేమే తయారు చేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా సినిమా కొత్తగా అయితే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.