Naga Chaitanya : జోష్ చిత్రంతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. అక్కినేని లెగసీని కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. కాగా చైతు ప్రేమించి పెళ్లాడిన సమంత తో కొన్ని వివాదాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయినా కానీ చైతన్య ఎప్పటి లాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
కాగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ యంగ్ హీరో అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. తమిళ సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి చైతూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘మానాడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకట్ ప్రభు. నాగ చైతన్య 22వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య ఒక పవర్ ఫుల్ కాప్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్ లో నాగచైతన్య లుక్ చాలా ఇంటెన్సిటీతో ఉంది.
ఆ పోస్టర్ లో “సమాజంలో మార్పు కావాలని కోరుకున్నప్పుడు, ఆ మార్పు నీలోనే మొదలవ్వాలి” అనే కాప్షన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక చైతన్య కెరీర్ లో వస్తున్న మొదటి బై లింగువల్ చిత్రం ఇది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.