Naga Chaitanya : నాగచైతన్య ఇటీవల తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ (Custody) అనే బై లింగువల్ మూవీ చేశాడు. అయితే ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతున్నా చైతన్య ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. తన తదుపరి సినిమా కార్తికేయ 2 (Karthikeya 2) తో పాన్ ఇండియా హిట్టు అందుకున్న చందూ మొండేటితో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు.
ఇది ఇలా ఉంటే, తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశాడు. అదేంటంటే.. పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్ థాంక్యూ చెబుతూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. అక్కడ చేసిన ప్రయాణం తనకి ఎప్పటికి గుర్తుండి పోతుందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ చైతన్య అక్కడికి ఎందుకు వెళ్లాడని ఆలోచిస్తున్నారా..?
ఆదిశక్తి థియేటర్ యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో ఎంతో పేరుగాంచింది. కొత్తగా నటన నేర్చుకోవాలన్నా, లేదా ఆల్రెడీ యాక్టర్స్ గా ఉన్న నటులే యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలన్నా అక్కడికి వెళ్తుంటారు. ఇక చైతన్య కూడా ఈ రెండో క్యాటగిరీలోనే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ హోమ్ వర్క్ అంతా చందూ మొండేటితో చేయబోయే సినిమా కోసమేనా? అని సందేహం వస్తుంది.
ఈ మూవీ స్టోరీ లైన్ గుజరాత్ లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఉండబోతుందట. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ఎన్నో ట్విస్ట్ లు, అలాగే చాలా ఎమోషన్ తో మూవీ ఉండబోతుందట. ఇక ఈ సినిమాలో చైతన్య బోట్ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. దీంతో సినిమాలో ఒక పక్కా పల్లెటూరి కుర్రడిలా నేచురల్ గా కనిపించడానికి చైతన్య హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా చందూ అండ్ చైయ్ కాంబినేషన్ లో ఇప్పటికే ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.