Entertainment లైఫ్ లో ప్రస్తుతం తను చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు కింగ్ నాగార్జున.. విషయంలో ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేస్తానని నెంబర్ వన్ నెంబర్ టువంటి లెక్కలు ఎప్పుడూ తాను పట్టించుకోలేదని అంటున్నారు.. జీవితంలో ప్రస్తుతం తానున్న దశను బాగా ఆస్వాదిస్తున్నానని నాగార్జున.. కథ తనకు నచ్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని నిర్మొహమాటంగా చెప్పేస్తానని తెలిపారు..
ఒక హీరోగా తన శక్తి సామర్థ్యాలు ఏంటో.. తనకు తెలుసని కింగ్ నాగార్జున అన్నారు. పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అనవసరమైన తలనొప్పులు పెట్టుకొని మనస్శాంతి లేకుండా చేసుకునే స్థితికి తన సినిమా రాకూడదని ఎప్పుడూ అనుకుంటానని అన్నారు. తన సినిమా ఎంత వసూలు చేస్తుందో.. ఎంతవరకు పెట్టుబడి పెట్టొచ్చు.. అనే విషయాలు 38 ఏళ్ల సినీ రంగంలో తనకు బాగా అనుభవం ఉందని తెలిపారు.. నన్ను నమ్మి సినిమాలు తీసిన నిర్మాతలు ఎప్పుడూ మోసపోకూడదనే సిద్ధాంతం తన తండ్రిని నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు..
ఒకప్పటి రోజుల్లో సినిమా రివ్యూలు పేపర్లో వచ్చేవి. అందువలన చాలా లేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. వెంట వెంటనే వచ్చేస్తున్నాయి.. అందుకే వెంటనే సినిమా హిట్ అయిందో.. ఫ్లాప్ అయిందో ప్రేక్షకులకు తెలిసిపోతుంది అని అన్నారు. క్వాలిటీ ఆఫ్ ఫిలిం మేకింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని.. నటీనటులు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరి.. దర్శక నిర్మాతలు సినిమా కథ కోసం లోతైన చర్చ జరిగినప్పుడు సినిమా మరింత విజయం సాధిస్తుందని నాగార్జున తెలిపారు.