అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుదలైన మొదటిరోజునే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని శనివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్రకమంలో నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాబివందనం తెలియజేస్తూ ఆరంభించారు. జనవరి 14న అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. నాన్నగారికి సంక్రాంత్రికి సినిమాలు విడుదల చేయాలని అంటుండేవారు. అప్పటి నుంచీ ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే వుండేది. నాన్నగారు చేసిన `దసరా బుల్లోడు` జనవరి14న విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని చవిచూసింది. అలాగే మేము ఈసారి బంగార్రాజు విడుదలచేశాక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.అసలు ఈరోజు స్టేజీపై టెక్నీషియన్స్ అందరూ వున్నారు. వారి గురించి ఎందుకు చెబుతున్నానంటే, సినిమాకు వెన్నెముకలాంటివారు వీరంతా. వీరంతా కలిసికట్టుగా చేయబట్టే సక్సెస్ వైపు సాగింది, అంది ఎంత సక్సెస్ అయిందంటే, ఈరోజు పొద్దునే కలెక్షన్లు వచ్చాయి. ఒక్కరోజులోనే 17.5 కోట్ల గ్రాస్ ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్ అంతా కలిపి వచ్చింది అని చెప్పారు. ఈ సినిమా మైసూర్ ప్రాంతంలో తీశాం. అక్కడ ఎంతోమంది సహకరించారు. ప్రతి నటీనటులకూ, టెక్నీషియన్స్ కు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్షన్ సీన్స్‌ను రామ్ లక్ష్మణ్ బాగా ఓన్ చేసుకుని డిజైన్ చేశారు. వాటికి మంచి పేరు వస్తుంది అన్నారు.