Movie సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిరా దేవి ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహేష్ బాబును ఆ స్థితిలో చూసిన అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.. ఆ ఫ్యామిలీకి ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ సమయంలో షూటింగ్ కారణాలతో వేరే దేశంలో ఉన్న బాలయ్యకు ఇందిరా దేవి ని కడసారి చూసే అవకాశం లేకుండా పోయింది.. ఆ సమయంలో బాలయ్య టర్కీలో ఉండిపోయారు. సోషల్ మీడియా వేదికగా తన సంతాపాన్ని తెలియజేసిన బాలకృష్ణ నేరుగా అయితే రాలేకపోయారు.. దీంతో ఆసమయంలో మహేష్ బాబుని కలవటానికి రాలేకపోయిన బాలయ్య.. ఇటీవలే నేరుగా మహేష్ బాబు ఇంటికి వచ్చారు..
ఇందిరా దేవి గారికి ఇటీవల సంతాప సభను ఏర్పాటు చేశారు అయితే బాలకృష్ణ మహేశ్ బాబును ఓదార్చడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఘట్టమనేని కుటుంబసభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు. అయితే గత కొన్నాళ్లుగా మహేష్ బాబు ఇంట్లో విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే గత ఏడాది విజయనిర్మల మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే ఈ విషాదం నుంచి ఆ కుటుంబం ఇంకా పూర్తిగా ముందు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడం ఆ కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.. నాయనమ్మ మరణాన్ని తట్టుకోలేకపోయినా మహేష్ తనయ సితార బాధ వర్ణనతీతం అనే చెప్పాలి ఆ స్థితిలో ఆ కుటుంబాన్ని చూసిన అభిమానులంతా ఎంతో బాధ పడ్డారు.. ఇక ఈ విషాదంతో సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన మహేష్ బాబు మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మళ్ళీ సోమవారం నుంచి ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.