Nandamuri Balakrishna : ఒక వైపు సినిమాలు మరో వైపు టాక్ షో తో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇన్నాళ్ళు బాలయ్య లోని ఒక యాంగిల్ ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయన మరో వెర్షన్ ని చూస్తున్నారనే చెప్పాలి. అన్ స్టాపబుల్ టాక్ షో తో ఆయన ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా ఓపెన్ చేశారు. అలానే ఎమ్మెల్యే గా కూడా తన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సేవలో తన వంతు కృషి అందిస్తూ ముందుకి సాగుతున్నారు. అదే విధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారు. ఇప్పటికే తన మంచి మనసుతో కోట్ల మంది హృదయాల్లో రియల్ హీరోగా పేరొందిన బాలయ్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలే కాకుండా… వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి సీనియర్ హీరోలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కానీ బాలయ్య మాత్రం ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించలేదు. కానీ తొలిసారి ఇటీవల బాలయ్య ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయిప్రియ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా… రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ‘116 పారమౌంట్’ యాడ్‌లో నటించారు బాలకృష్ణ. ఈ యాడ్ లో కూడా తనదైన శైలిలో డైలాగ్‌లు చెప్తూ అలరించారు బాలయ్య.
కాగా ఈ మొదటి యాడ్ ద్వారా బాలయ్య అందుకున్న తొలి పారితోషికం అక్షరాలా రూ.15 కోట్లు. అయితే ఈ భారీ పారితోషికం మొత్తాన్ని… ఆయన ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్’కి దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ దేవి నాగవళ్లి తన ఫేస్ బుక్‌లో షేర్ చేయగా… ఇప్పుడది వైరల్‌గా మారింది. దీంతో నందమూరి అభిమానులే కాకుండా మిగిలిన వారంతా కూడా ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.