Nandamuri Balakrishna : యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా… అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి నటసింహం బాలకృష్ణ రావడం జరిగింది.
ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ… అల్లు ఫ్యామిలీకి, వారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. ‘‘ఇప్పుడున్న దర్శకులందరూ ట్రెండ్‌కి అనుగుణంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అల్లు అరవింద్ గారితో నా అనుబంధం ఇప్పటిది కాదు. రామలింగయ్యగారికి నాన్నగారంటే చనువు, భయం ఉండేది. ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఓ అడది ఉంటుంది. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది. కాలంతో పాటు అభిరులు మారుతున్నాయి. ఇప్పుడు లివింగ్ టుగెదర్ , ఎఫైర్స్ వంటివి నడుస్తున్నాయి అని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా అన్‌స్టాపబుల్ షోకి పిలిచి అల్లు శిరీష్ నుంచి అన్ని సీక్రెట్స్ లాగుతాను” అని సరదాగా అన్నారు. అలాగే ఇటీవల వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ”మనిషి జీవితంలో రోజువారీ కావాల్సిన వాటితో పాటు వినోదాన్ని కూడా కోరుకుంటాడు. అలాంటి వినోదాన్ని సినిమాలు అందిస్తున్నాయి. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు అందించాలి అని పరిశ్రమ పెద్దలు, యువతరం దర్శకులు ఆలోచించాలి. వాళ్లకి నచ్చని సినిమాలు వారిపై రుద్దొద్దు”అని అన్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.