గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘అఖండ’ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. దానికి ధీటుగానే ఒక సినిమా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఒక మంచి సినిమాని ఇవ్వగలమనే నమ్మకంతో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యాక్షన్ సినిమా చేద్దామని నేను దర్శకుడు అనుకున్నాం. దిని కోసం వీరసింహారెడ్డి కథని ఎన్నుకున్నాం. దీనికి అద్భుతమైన మాటలు సాయి మాధవ్ బుర్రా అందించారు. తమన్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించారు. రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు అద్భుతంగా చేయడం జరిగింది. ఇది అందరి సమిష్టి కృషి. వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్రని అద్భుతంగా చేశారు. అన్న చెల్లులు అనుబంధం అద్భుతంగా ట్రీట్ చేయడం జరిగింది. శ్రుతి హాసన్ చక్కగా నటించారు.
అలాగే దునియా విజయ్, తోపాటు అన్ని పాత్రలు కు నటీనటులు న్యాయం చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని అందరి నుండి ప్రతిభని రాబట్టుకునే సామర్ధ్యం వున్న దర్శకుడు. నా అభిమాని చిత్రాన్ని ఎంతోఅ అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున అభినందనలు. సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా వీరసింహా రెడ్డి. ప్రేక్షకులు, అభిమానులు, స్నేహితులు, అందరినుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది. థియేటర్ లో అన్నా చెల్లులు మధ్య సన్నివేశాలు చూస్తుంటే మహిళా ప్రేక్షకులే కాదు మగవాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నవరసాలు సమపాళ్లలో వున్నాయని ఈ సినిమా విజయం తెలియజేస్తోంది.
మా నిర్మాతలు రవి, నవీన్ సినిమాని ఎంతో ప్యాషన్ గా తీస్తారు. నాకు తగ్గ సినిమా తీయలాని వారి తపన ఈ సినిమా ఖర్చు విషయంలో కనిపిస్తుంది. అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షకులకు, అభిమానులు మరోసారి కృతజ్ఞతలు.అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ తెలియజేశారు.