AP Politics : దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ రాష్ట్రానికి ఇకపై అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు, తిప్పలు, పన్నుల మోతలు తప్ప మరేమీ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. అభివృద్ధి అనేదే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని మెరుగైన మార్గంలో నగిపించేలా ఎన్డీఏ కూటమికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. కార్యక్రమంలో వీరమాచనేని శివప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, పేరేపి ఈశ్వర్, పఠాన్ హయ్యత్ ఖాన్, కాలేషా వలి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్