Entertainment విక్టరీ వెంకటేష్ ప్రధాని పాత్రలో నటించిన నారప్ప చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది అయితే ఈ చిత్రాన్ని మళ్లీ ఒక రోజు మాత్రమే విడుదల చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ బాబు అనుకుంటున్నాట్టు తెలిపారు.. అలాగే సందర్భంగా వచ్చిన కలెక్షన్స్ అన్ని ఓ చారిటీ ట్రస్ట్ కు ఇచ్చేయటానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు
ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన పెద్ద మనసులో చాటుకున్నారు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఈయన ఈ చిత్రాన్ని మళ్లీ ఒక రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయనున్నారు.. డిసెంబర్ 13 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు.. అయితే ఆరోజు వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని ఓ క్లారిటీ ట్రస్ట్ కు ఇచ్చేయనున్నట్టు తెలిపారు.. అలాగే ఇలా చేయటం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని కూడా అన్నారు.. ఈ న్యూస్ విన్న వెంకటేష్ అభిమానులు అందరూ సురేష్ బాబు మనసును పొగడకుండా ఉండలేకపోతున్నారు..
నారప్ప సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా ప్రియమణి నటించింది. అలానే రాజీవ్ కనకాల, కార్తీక్ రత్నం, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీలో వెంకటేశ్ నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఓటీటీలో నారప్ప మూవీ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు మంచి రేటింగ్‌ని కూడా సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గత ఏడాది కరోనా టైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు..