Narsimhapuram Movie Released on 30th, Nanda Kishore, Sriraj Bhalla, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: *నరసింహపురం* విడుదల వేడుక 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్!!
గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న విడుదలవుతున్న సందర్భంగా ప్రి-రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష ఈ చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటించారు.
గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను తలపించేలా జరిగిన ఈ వేడుకలో ఎమ్.ఎల్.ఎ లక్ష్మారెడ్డి, ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు సమీర్, ఊర్వశి ఓటిటి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర కథానాయకుడు నందు, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, చెల్లెలు పాత్రధారి ఉషతోపాటు చిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసిన ముఖ్య అతిధులు ‘నరసింహపురం’ పెద్ద విజయం సాధించి చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నటీనటులు-సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. హీరో శ్రీకాంత్, తమ్మారెడ్డి సమీర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకనిర్మాతలు.. “నరసింహపురం” కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసి… ఈ చిత్రం అద్భుతంగా రూపొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!