Dasara Movie : నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా రా అండ్ రస్టిక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో నాని పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొడుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బొగ్గు గనుల నేపధ్యంలో తెరకెక్కుతుంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
సముద్రఖని కీలకమైన పాత్ర పోషించిన ఈ సినిమాలో, దీక్షిత్ శెట్టి .. సాయికుమార్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్చి 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాని – కీర్తి సురేశ్ రెండోసారి కలిసి నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అయితే తాజాగా రాజమౌళి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. ధనుష్, దుల్కర్ సల్మాన్, షాహిద్ కపూర్, రక్షిత్ శెట్టి ఈ టీజర్ లను రిలీజ్ చేశారు.
పూర్తి రా అండ్ రస్టిక్‌గా ఈ టీజర్ కట్ ఉండటంతో ఈ సినిమాతో నాని మాస్ కాదు.. ఊరమాస్ బ్లాక్‌బస్టర్‌ను పట్టుకొస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా నాని చెప్పే డైలాగులు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ‘‘మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం..’’ అంటూ నాని చెప్పే డైలాగ్ ఊరమాస్‌గా చూపెట్టారు. ఇక నాని ఈ సినిమా కోసం చేసిన మేకోవర్ ఈ సినిమాకే హైలైట్‌గా మారింది. ఇక టీజర్ చివర్లో నాని నోట్లో కత్తి పెట్టుకుని వేలితో రక్తపు సింధూరం పెట్టుకోవడం హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.