Entertainment లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా ఇంటర్వ్యూకు హాజరైంది ఈ సందర్భంగా ఇండస్ట్రీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార ఈ మధ్య కాలంలో ఏదో ఒక కారణాలతో తరచూ వార్తలు నిలుస్తూనే వస్తుంది ఈ భామ అయితే తాజాగా కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈమె ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ సందర్భంగా ఇండస్ట్రీ కోసం టాలీవుడ్ హీరోల కోసం ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది…
నయనతార తను నటించే ఏ సినిమాలుకు కూడా మూవీ ప్రమోషన్స్ కు వెళ్లదు అంతే కాకుండా దానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వంటి ఎలాంటి ఈవెంట్స్ కు అటెండ్ అవ్వదు అయితే దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగిన ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు నయనతార అయితే తాజాగా తను ఈవెంట్లకు ఎందుకు వెళ్ళను చెప్పుకొచ్చింది.. సినీపరిశ్రమలో ఎన్నో అసమానతలు ఉన్నాయి.. అక్కడ హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని… అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది. ఒక వేళ హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు వెళ్ళినా.. తమను ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు,ప్రమోషం ఈవెంట్లకు వెళ్లడం మానేశానని తెలిపింది. అలాగే తాను లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నానని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చానని తెలిపిన నయనతార తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తేడి ఓరియంటెడ్ సినిమాలో లేవని తెలిపింది అలాగే ఇండస్ట్రీలో ప్రతి విషయంలో ఎందుకు అసమానతలు చూపిస్తారంట తన బాధను వ్యక్తం చేసింది..