Viral News: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర లో లక్నోకు చెందిన ఓ యువతిపై నెటిజనులు మండిపడుతున్నారు. ముందు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిని అరెస్ట్ చేయడం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా. లక్నోకు చెందిన ఈ యువతి క్యాబ్ డ్రైవర్‌ను ఎగిరి ఎగిరి చంప దెబ్బలు కొడుతుంది. ఆ కారు డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించుంటాడేమోనని అనుకుంటే తప్పే సుమీ. ఆ కారు డ్రైవర్ తప్పు లేకపోయినా అక్కడ జనాలను నమ్మించింది ఆ యువతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటో మీరు కూడా చూస్తే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయమని కామెంట్ పెట్టడానికి సిద్ధమైపోతారు.
అసలు విషయంలోకి వెళితే ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది. అయితే వాహనాలు వేగంగా తీసుకు వెళుతూ ఉంటాయి. అదే సమయంలో ఓ యువతి నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలోనే ఓ క్యాబ్ ఆమెకు దగ్గరగా వచ్చి ఆగిపోతుంది. దీంతో ఆ యువతి ఆగ్రహం తెచ్చుకొని క్యాబ్ డ్రైవర్‌ను బయటకు లాగి చంప దెబ్బలు కొడుతుంది. ఆ యువతి తనని క్యాబ్ డ్రైవర్ గుద్దాడని చెప్పడంతో అక్కడున్న ప్రజలు కూడా ఆ యువతికే మద్దతు తెలిపారు.
అయితే ఈ సంఘటన సీసీటీవీ వీడియోలో మాత్రం ఆమె చెప్పినదానికి విరుద్ధంగా కనిపిస్తుంది. రోడ్డు దాటుతున్న క్రమంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను చూడగానే బ్రేక్స్ వేశాడు. అయితే ఆ యువతి వెంటనే ఆగ్రహానికి గురై అతడిని అనవసరంగా కొట్టింది. క్యాబ్ డ్రైవర్ మొబైల్ లాక్కొని పగలగొట్టి నాన్న రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజనులు ఆ యువతిపై ఫైర్ అవుతున్నారు ఆమెను అరెస్ట్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.