Crime రోజు రోజుకు ఆసుపత్రి సిబ్బంది ఆగడాలు మితిమీరి పోతున్నాయి.. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తీరు ఎక్కువగా కనిపిస్తుంది.. పెద్దవారి పట్ల కాకుండా అప్పుడే పుట్టిన పసిపిల్లల పట్ల కూడా ఏమాత్రం జాగ్రత్త వహించడం లేదు తాజాగా ఓ ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన నవజాత శిశువు చనిపోయిన సంఘటన అందర్నీ కలవరానికి గురి చేసింది..
ఓ ఆసుపత్రి సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు చనిపోయిన సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.. అప్పుడే పుట్టిన బిడ్డను ఇంటెన్స్ కేర్ లో ఉంచాల్సి వచ్చింది. అయితే అక్కడ ఉన్న అధిక వేడిని తట్టుకోలేక ఆ శిశువు చనిపోయింది.. అసలు ఏం జరిగిందంటే రాజస్థాన్ రాష్ట్రంలో బిల్వారా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నియోనార్టల్ ఇంటెన్స్ కేర్ యూనిట్లో వార్మర్ సరిగా పనిచేయని విషయాన్ని అక్కడ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు అయితే ఇంటెన్సివ్ కేర్ లోని ఉంచిన శిశువు ఆ వార్మర్ అధిక వేడి ఎక్కడం వల్ల ఆ వేడిని తట్టుకోలేక చనిపోయింది.. అయితే ఈ మొత్తం విషయం రాజస్థాన్లో మహాత్మా గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది ఈ సంఘటనలో ఇంకొక నవజాత శిశువు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది
ఈ విషయంపై ఆ పాప కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకు వచ్చింది దీంతో వారంతా అక్కడే ధర్నాకు దిగారు.. దీనిపై స్పందించిన ఆసుపత్రి అధికారి ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు..