Niharika Konidela:అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్2 చిత్రీకరణ జరుగుతుండగా.. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మెగా డాటర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.నిజానికి ఆ రోల్ కోసం మొదట న్యాచురల్ బ్యూటీ అయిన సాయిపల్లవి ఆమె రిజెక్ట్ చేయడం తో నిహారికని సంప్రదించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Ocon Star Allu Arjun ), నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రత్యేకించి బన్నీ మ్యానరిజమ్స్, రా అండ్ రస్టిక్ లుక్‌కు తోడు సాంగ్స్, సుకుమార్ స్టోరీ టెల్లింగ్‌కు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప2’ (Pushpa2) చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంధుకనే మేకర్స్.. సెకండ్ పార్ట్‌లో మరిన్ని పాత్రలను యాడ్ చేశారు. ఇదే క్రమంలో ఒక కీలక పాత్ర కోసం మెగా డాటర్‌ను (Mea Daughter) తీసుకుంటున్నట్లు సమాచారం.
‘పుష్ప2’లో గిరిజన యువతి (Tribal Girl) పాత్ర కోసం నిహారిక కొణిదెలను సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఇది గతంలో హీరోయిన్ సాయి పల్లవి రిజెక్ట్ చేసిన పాత్రేనని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
నిహారిక కొణిదెల విషయానికొస్తే.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో ఆమె విడాకులు తీసుకుందన్న వార్త ఈ మధ్య నెట్టింట వైరల్ అవుతోంది. అయినప్పటికీ ఈ న్యూస్‌పై ఆమె ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం తను డిస్నీ+హాట్‌స్టార్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’లో నటించింది. ఇది మే 19న ప్రీమియర్ అవుతుంది. ఇదిలా ఉంటే, తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి డాన్స్ రీల్ కోసం స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.