Nikki Galrani : హీరోగాను, విలన్ గాను విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది పిన్నిశెట్టి. ఆది పినిశెట్టి కుటుంబం తెలుగువారే అని అందరికీ తెలిసిందే. అందుకే ఆదికి తమిళ్ తో పాటు తెలుగు లోనూ అభిమానులు ఉన్నారు. ‘ఒక వి చిత్రం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో… ‘వైశాలి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఏకవీర’, ‘గుండెల్లో గోదారి’ ‘మలుపు’, ‘మరకతమణి’ లాంటి సినిమాలు తెలుగులోనూ ఆకట్టుకున్నాయి. తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ‘రంగస్థలం’ సినిమాలో కుమార్ బాబుగా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఇటీవల ‘ది వారియర్’ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ప్రముఖ నటి నిక్కి గిల్రాని తో ప్రేమాయణం నడిపిన ఈ హీరో… మే 18, 2022 న కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి యగవరయినమ్ నా క్కక, మరగద నానయమ్ చిత్రాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇక ఇరువురి కుటుంబసభ్యులు వీరి వివాహానికి అంగీకరించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా గత కొంతకాలంగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై నిక్కీ స్పందించింది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి… డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ స్మైలీ ఎమోజీని షేర్ చేసింది. అలాగే ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదని.. కానీ భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది. అప్పుడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఈ పుకార్లను నమ్మకండి అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది.