Devara Movie : ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల శంషాబాద్ ఏరియాలో భారీ సెట్ వేసి దేవర సినిమా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు కెమెరామెన్ గా పని చేస్తున్న రత్నవేలు షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఎన్టీఆర్ తో నైట్ ఎఫెక్ట్‌లో, తక్కువ లైట్‌లో, అదిరిపోయే యాక్షన్ సీన్స్ నీళ్ళల్లో ఇప్పుడే చిత్రీకరణ పూర్తయింది అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు. దేవర కెమెరామెన్ ఈ అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫైట్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.