టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా తన అభిమాని ఉగ్గం రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్ల తిరుపతి సంగీత దర్శకత్వంలో కేటీఆర్ గారిపై రూపొందించిన ‘special song on Helping Heart’ పాటను ప్రముఖ సినీ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. కేటీఆర్ గారు సేవ దృక్పథంతో చేసిన సేవలపై పాటను రూపొందించిన రాకేశ్, మాట్ల తిరుపతిని శంకర్ అభినందించారు. అలాగే కేటీఆర్ గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, పాల్గొన్నారు.