Health Tips: అందమైన కురుల కోసం మార్కెట్లో దొరికే వివిధ క్రీములను మన జుట్టుపై ఉపయోగిస్తూ ఉంటారు. అవి కాస్త జుట్టు రాలడానికి కారణం అవుతాయి అదేవిధంగా ఉద్యోగాలు లేదా కుటుంబ సమస్యలు ఒత్తిడి అధికం అవ్వడం వలన ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం వంటి సమస్యలు చిన్న వారి దగ్గర నుండి పెద్దవారి వరకు బాధిస్తుంది. అయితే చేసిన తగ్గించేందుకు మన వంటింట్లో ఉండే వాటితో జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలో తెలుసుకోండి మరి.
గుడ్లు: గుడ్డు ద్వారా మన హెయిర్ ఫాల్ సమస్యకు చెప్పు పెట్టవచ్చు. ఒక బౌలర్ రెండు గుడ్లు తీసుకొవాలి గుడిలో ఉండే పచ్చ సోనా కాకుండా తెల్లటి మిశ్రమాన్ని తీసుకోవాలి ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకోవాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా జుట్టు హెయిర్ ఫాల్ వాటి సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. అలానే జుట్టు కూడా స్మూత్ గా తయారవుతుంది.
కరివేపాకు: కరివేపాకుతో కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ కరివేపాకు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలానే కరివేపాకు జ్యూస్ తీసుకోవడం ద్వారా కంటి చూపును కూడా మెరుగు చేసుకోవచ్చు.
కుంకుడు కాయలు: ఆధునిక కాలంలో షాంపూలు అధికంగా ఉపయోగించడం వలన హెయిర్ ఫాల్ సమస్య చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా బాధిస్తుంది. షాంపూల్లో అధిక రసాయనాలు ఉండటం వలన హెయిర్ ఫాల్ సమస్య అధికమవుతుంది. అయితే ప్రకృతి ప్రసాదించే వాటిల్లో కుంకుడుకాయ ఒకటి. కుంకుడుకాయతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గించుకోవచ్చు అలానే కుంకుడు కాయతో తలస్నానం చేయడం వలన కళ్లకు కూడా చాలా మంచిదట.