Entertainment ఇంతకు ముందు నచ్చిన సినిమా థియేటర్‌కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. ఇప్పుడు అదే సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని తెగ వెతికేస్తున్నారు. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అని ముందు నుంచే ఆరాలు తీస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన కొన్ని సినిమాలు ఈ వారం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మీకు నచ్చిన ఎన్నో సినిమాలు మిమ్మల్ని అలరించడానికి రాబోతున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమాలు/వెబ్‌సిరీస్ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేసేయండి.
ఆహా:
* కవిసామ్రాట్ (తెలుగు) అక్టోబర్ 22
* కపట నాటక సూత్రధారి(తెలుగు) అక్టోబర్ 21
* స్వాతిముత్యం (తెలుగు) అక్టోబర్ 24
* పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21
జీ5:
* బింబిసార (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం) : అక్టోబర్ 21
* ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21
అమెజాన్ ప్రైమ్:
* ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
* ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
నెట్‌ఫ్లిక్స్:
* కృష్ణ వ్రింద విహారి (తెలుగు) అక్టోబర్ 23
* బార్బేరియన్స్ (వెబ్‌సిరీస్-2) అక్టోబరు 21
* ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
* 28 డేస్ హాంటెడ్ (వెబ్ సిరీస్) అక్టోబరు 21
హాట్‌స్టార్:
* లైగర్ (హిందీ) అక్టోబర్ 21
స్ట్రీమింగ్ అవుతోన్న చిత్రాలు..
* ఒకే ఒక జీవితం: సోనీలివ్
* అమ్ము: అమెజాన్ ప్రైమ్ వీడియో