Health Tips: పైనాపిల్ కి మరో పేరు అనాస పండు సాధారణంగా పైనాపిల్ తినడానికి అంత మక్కువ చూపరు. అయితే పైనాపిల్ తీసుకోవడం ద్వారా అధిక బరువును అదుపులో ఉంటుంది మధుమేహం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.అలాగే మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మానికి తగినంత తేమను అందించి తాజాగా ఉంచుతుంది మరియు వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చాలామంది మొటిమలతో బాధపడుతూ ఉంటారు మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తూ నిరాశ చెందుతారు.పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, అమైనో యాసిడ్స్ మొటిమలను మరియు చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేస్తుంది. పైనాపిల్ తో ఈ చిన్న చిన్న చిట్కాలు మీకోసం తెలుసుకోండి మరి.
నాలుగైదు పైనాపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని బాదం ఆయిల్ బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. వారానికి మూడుసార్లు అయినా చేస్తూ ఉంటే చర్మంపై ఉన్న మలినాలు పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. పైనాపిల్ నిమ్మరసాన్ని కలుపుకొని రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు తగ్గిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. పైనాపిల్ పేస్ట్ తేనె పెరుగు ఈ మూడిటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఈ చిట్కాలు పాటించే ముందు ఆ మిశ్రమాలను కాస్త చేతికి రాసుకున్న తర్వాత దురద మంట వంటివి లేకపోతే ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోకపోవడం మంచిది.