Parvathi Nair : తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి పార్వతి నాయర్. కాగా ఇటీవల తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది ఈ నటి. గత నెల అక్టోబర్ 20న ఆమె ఇంట్లో రూ. 9 లక్షల విలువైన రెండు వాచీలు… రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ. 2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీకి గురైందని, తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై అనుమానముందని పార్వతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈమె ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే సుభాష్ ని అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ ఇంటికి కూడా వెళ్లి చెక్ చేశారు. అయితే తాజాగా ఈ దర్యాప్తులో సుభాష్ పలు సంచలన విషయాలు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పార్వతి నాయర్ తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని… తన ఇంట్లోకి రాత్రి పూట ఎవరెవరో వచ్చేవాళ్ళని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది నేను చూశానని, నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకి తోసేసి నన్ను మానసికంగా వేధిస్తుంది. గతంలో నన్ను కొట్టింది, నా ముఖం పై ఉమ్మి వేసింది. నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించింది అని తెలిపాడు.
అలాగే ఆమె తన సహచరులతో కలిసి తనపై దాడి చేసిందని తెలిపాడు. దీంతో సుభాష్ చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. కాగా పోలీసులు ఈ దర్యాప్తులో పార్వతి నాయర్ ని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అయితే సుభాష్ చేసిన వ్యాఖ్యలపై పార్వతి నాయర్ ఇంకా స్పందించలేదు.