Entertainment స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హరి శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు మరో స్టార్ డైరెక్టర్ కూడా దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం డైరెక్టర్ ప్రభాస్ రంగంలోకి దిగిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం పవన్ హరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ వినిపిస్తుంది… అయితే, ఇప్పటివరకూ ఈ మూవీ గురించి మూవీటీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా ‘లవ్ యు రామ్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీశ్ శంకర్ తన సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌తో తీయబోయే సినిమా కోసం సీనియర్ దర్శకుడు దశరథ్ పనిచేస్తున్నట్లు చెప్పారు.
“నేను దుర్గా ఆర్ట్స్‌లో అసిస్టెంట్‌గా చేరినప్పుడు దశరథ్ అన్నయ్య సంతోషంతో హిట్ కొట్టారు. ఆ తర్వాత నేను దిల్‌రాజ్ నిర్మాణ సంస్థకు వెళ్తున్న సమయంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ తో మరో బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఆయన డైరెక్షన్, రైటింగ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పవన్‌తో నేను చేస్తున్న సినిమాకు స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అందుకు దశరథ్ అన్నయ్యకు ధన్యవాదాలు. లవ్ యూ రామ్ నేను చూశాను. చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని హరీశ్ శంకర్ తెలిపారు. అయితే, దశరథ్ భవదీయుడు భగత్‌సింగ్ కోసం పనిచేస్తున్నారా? లేదా ఏదైనా రీమేక్‌పై పనిచేస్తున్నారా? అన్న విషయాన్ని మాత్రం హరీశ్ శంకర్ చెప్పలేదు. అయితే తాజాగా మరొక విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. పవన్-హరీశ్ కాంబినేషన్‌లో రానున్నది తమిళ చిత్రం తెరి రీమేక్ అని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో హరీష్‌శంకర్ తన సినిమా గురించి ట్వీట్ చేయగానే, రీమేక్ వద్దు అంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రతిస్పందించారు.