Entertainment టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది ప్రత్యేకంగానే ఉంటుంది.. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.. అలాంటిది ఇన్నాళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆ ఫోటో పెడితే అది ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో ఊహించుకోవచ్చు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అద్భుతమే ఆయన సినిమాలో నటించినా.. డాన్స్ చేసినా.. డైలాగ్ చెప్పిన అభిమానులు ఉర్రూతలూగుతారు.. అలాగే అతని చిన్న చిరునవ్వు కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఓ పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎలా ఉంటుంది.. అలాంటిదే తాజాగా జరిగింది.. రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఓ కిల్లింగ్ ఫోజ్ షేర్ చేశారు పవన్. తాజాగా ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది
హీరో పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అంటే అమితాసక్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జాని చిత్రం గురించి కొన్నాళ్ల పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. జాని మూవీలో పవన్ ఫైటర్ రోల్ చేశారు. రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. ఖుషి వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తర్వాత వచ్చిన యాక్షన్ లవ్ ఎమోషనల్ లవ్ డ్రామా జనాలకు ఎక్కలేదు. అలాగే పాత్రలో సహజత్వం కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. 2003 లో జాని విడుదల కాగా… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అవసరం వచ్చింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీలో బందిపోటు పాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు.
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022