Entertainment పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురు చూస్తారో అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవర్ స్టార్ తదుపరిచిత్రం ఎప్పుడు అనేది ఎవరికి క్లారిటీ లేకుండా ఉంది అయితే ప్రస్తుతం ఈ విషయంపై ఒక క్లారిటీ రానట్టు తెలుస్తోంది..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది కూడా ఎవరికి తెలియడం లేదు అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపించిన ఇందులో నిజం లేదంటున్నారు సిని వర్గాలు.. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో ఓ ట్విస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.. హర హర వీరమల్లు షూటింగ్ను పక్కనపెట్టి వినోదాయ సితమ్ సినిమాలో నటించిన ఉన్నారని సమాచారం.. అయితే ఈ సినిమా షూటింగ్ నవంబర్లో మొదలుకానుందని ఎందుకోసం పవన్ తన షెడ్యూల్ను మార్చుకుంటున్నట్టు సమాచారం అయితే రాజకీయాల వలన తనకు ఎక్కువ సమయం లేదని కేవలం 20 రోజుల్లో మాత్రమే షూటింగ్ పూర్తి చేసేయాలని షరతు కూడా విధించినట్టు తెలుస్తోంది…
అయితే ఈ సినిమాలతో పాటు డీవీవీ దానయ్య నిర్మాతగా `తేరీ` రీమేక్ ని కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో పవన్ వున్నట్టుగా తెలుస్తొంది.. ఈ రీమేక్ కు సాహో మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే..