OG Movie : పవన్ కళ్యాణ్ త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తున్నారు. ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే OG సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. పవన్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సుజిత్ దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో “They Call him OG” అనే సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది.
పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి. పవన్ డేట్స్ ఇస్తే ఓ 20 రోజుల్లో పవన్ ఉన్న పార్ట్ మొత్తం ఫాస్ట్ గా పూర్తి చేసేయాలని సుజిత్ చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి ఓ టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. దీంతో పవన్ అభిమానులు OG నుంచి రాబోయే గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ బర్త్ డేని ఇంకా స్పెషల్ గా OG సినిమా ఇచ్చే అప్డేట్ తో చేసుకోవాలని చూస్తున్నారు ఫ్యాన్స్.