Viral news నిజమైన ప్రేమకు ఏది అడ్డు కాదు ముఖ్యంగా ప్రేమించిన వారు తమ ప్రియుని ప్రియురాలని వదిలి ఒక క్షణం కూడా ఉండలేరు అందుకు కులాలు, మతాలు ప్రాంతాలు కూడా అడ్డు కాదని నిరూపిస్తూ ఉంటారు కొందరు తాజాగా ఇలాంటి ఓ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది..
ఈ కాలంలో యువత ప్రేమలో పడటం సాధారణమే అయితే ఆ ప్రేమ ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అనే మాట మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. కాలేజీల్లో చదువుకోడానికి బయట దేశాలు వెళ్ళినప్పుడు ప్రేమలో పడుతూ ఉంటారు కానీ ఆ ప్రేమలో కొన్నాళ్లపాటు మాత్రమే ఉంటున్నాయి కానీ తమ ప్రేమకు మాత్రం ఏది అడ్డు కాదని నిరూపించింది ఓ జంట.. విశాఖపట్నం సాలిపేటకు చెందిన శ్రీనివాస్ బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుకున్న అనంతరం పూణేల ఎంబీఏ చేశారు ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఏడేళ్ల క్రితం సింగపూర్ కు వెళ్లి అక్కడ ఒక కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నారు.. ఇదే క్రమంలో అదే సాకలో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్ కు చెందిన జమలాకుతో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి వీరి ప్రేమ గా మారింది..
అయితే వీరి ప్రేమకు కులాలు, మతాలు దేశాలు కూడా అడ్డుకాలేదు ఈ విషయాన్ని వీరిద్దరూ వారి ఇంట్లో చెప్పగా వాళ్ళు ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు అలాగే ఈరోజు పెద్దల సమక్షంలో విశాఖపట్నంలో వీరిద్దరు పెళ్లి ఘనంగా జరిగింది..