నెట్‌ఫ్లిక్స్ ఈరోజు తన మొదటి ఒరిజనల్ తెలుగు ఫిలిం ‘పిట్టకథలు` ట్రైలర్‌ని విడుదలచేసింది. ఈ నాలుగు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నలుగురు తెలుగు సినిమా అత్యుత్తమ దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు దర్శకత్వం వహించారు.
సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను `పిట్టకథలు` అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్రలకు ప్రాణం పోయడానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమలా పాల్, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ నాలుగు చిత్రాలు రాముల(తరుణ్ భాస్కర్), మీరా(బి.వి.నందిని రెడ్డి), ఎక్స్‌లైఫ్(నాగ్ అశ్విన్), మరియు పింకీ(సంకల్ప్ రెడ్డి). ప్రేమ, కోరిక, వంచన మరియు శక్తి మహిళా దృష్టి కోణంలో ఉంటూ వారికి ఏం కావాలో తెలియజేస్తుంది.
రోనీ స్క్రూవాలా యొక్క RSVP మూవీస్ మరియు ఆశి దువా సారా యొక్క ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన `పిట్టకథలు` 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.