Telangana News: పర్యావరణరహిత గణేశ్ ప్రతిమలను ఆదరించాలి: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
‘ప్లాన్ ఎ ప్లాంట్’ సంస్థ ప్రతినిధులు ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ను కలిసి మట్టి గణేశ్ ను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మట్టితో చేసిన గణేశ్ ప్రతిమలను ఆదరించాలన్నారు. తద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామన్నారు.
‘ప్లాన్ ఎ ప్లాంట్’ వారు తయారు చేసిన గణేశ్ ప్రతిమలు బహుల ప్రయోజనం కలిగినవన్నారు. గణేశ్ ను కుండీలోనే నిమజ్జనం చేసే వీలుందన్నారు. కుండీలో ముందుగానే ఉన్న విత్తనాలు మొక్కలనిస్తాయన్నారు. మిర్చి, టొమాటో, బెండీ, వంకాయ వంటి విత్తనాలు కుండీలో ఉంటాయని సంస్థ ప్రతిందులు తెలిపారు. సైబరాబాద్ సీపీ సీపీ సజ్జనార్, ఐపీఎస్ ను కలిసిన వారిలో ‘ప్లాన్ ఎ ప్లాంట్’ సీఈఓ గణేశ్ అమర్నాథ్ గుర్రం, సంస్థ ప్రతింధులు ఉన్నారు.