Political News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హాట్ హాట్ వాతావరణం నెలకొంది.రణరంగంగా మారిన కుప్పంలో పోటాపోటీగా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ ఉద్రిక్తను అధికం చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు. నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేందుకు వెళ్లారు చంద్రబాబు. అయితే వైయస్సార్ ఎన్టీఆర్ విగ్రహాలు పక్క పక్కనే ఉండడంతో వైసిపి కార్యకర్తలు ఎన్టీఆర్ కి కట్టిన ఫ్లెక్సీలను చించేశారు. దీనితో వైఎస్‌ఆర్ విగ్రహం వద్దనున్న ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన టేబుళ్లను ధ్వంసం చేశారు వైసిపి కార్యకర్తలు. ఈ ఘటనతో కుప్పంలో సెంటర్ లో హాట్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సంఘటనపై ఎందుకు స్పందించడం లేదు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తల తీరుకు నిరసనగా అన్న క్యాంటీన్ ఎదుట రోడ్డుపైనే కూర్చొని నిరసనలు తెలిపారు. వైసిపి తీరుపై టిడిపి నేతలు ఘాటుగానే స్పందించడం జరుగుతుంది. అయితే ఈ ఉద్రిక్తత నిన్నటి నుంచి జరుగుతుందని అక్కడ స్థానికులు తెలపడం జరిగింది.
ఇంత జరుగుతున్న ఏమి పట్టనట్టు ప్రస్తుత ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు కూడా ఈ తీరుపై సమంజస్సుగా స్పందించడం లేదని టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. అగ్గిలో నెయ్యి పోసినట్లు బొగ్గు మంటుంది కుప్పంలోని రాజకీయ వాతావరణం. అయితే దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎట్లా స్పందించనుందో అనేది మాత్రం హాట్ టాపిక్ గానే ఉందండోయ్.