Entertainment టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు తనదైన రీతిలో అభిమానులను మోటివేట్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా పూరి మ్యూజింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో ప్రోగ్రాంను చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ఇప్పటివరకు ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఆయన తాజాగా మరో కొత్త విషయాన్ని షేర్ చేసుకున్నారు..
దర్శకుడు పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు తనకు తెలిసిన విషయాలను తన అనుభవాల్ని ఆడియో రూపంలో విడుదల చేస్తూనే ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో పూరి మ్యూజిక్ స్టార్ట్ చేశాడు ఇందులో యువత కోసం ఎన్నో విషయాలు చెప్పుకొచ్చిన ఆయన… ప్రేమలో ఉన్న యువత కోసం వారి ఎమోషన్స్ కోసం చెప్పుకొచ్చారు.. అలాగే ఎప్పటికప్పుడు ప్రేమ విషయంలో తనదైన సలహాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు పూరి జగన్నాథ్.. ముఖ్యంగా ఎమోషన్స్ కు వచ్చే ఈయన లైఫ్ లో ఎలాంటి సిచువేషన్ ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలంటూ మోటివేట్ చేస్తారు
“ప్రతి రోజూ మనలో కలిగే ఎమోషన్స్‌కి కారణం మన శరీరంలోని కెమికల్స్. డోపమైన్ ఆక్సాటిస్ వంటి కెమికల్స్ వల్ల నవ్వు ఆనందం, ప్రేమ, కన్నీళ్లు కారటం ఇలా ఎన్నెన్నో ఫీలింగ్స్ మనలో కలుగుతుంటాయి. కానీ వయసులో ఉన్న యూత్ మాత్రం ప్రేమను నిజం అని అనుకుంటారు. అద్భుతం అనుకుంటాడు. ఆ అమ్మాయి దేవత అని అనుకుంటాడు. పవిత్రమైన వాళ్ల ప్రేమను పెద్దవాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ల మొహం, వాళ్ల పిండాకూడు.. ” తనదైన రీతిలో చెప్పుకొచ్చారు..