Entertainment డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు అభిమానులకు తనదైన శైలిలో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు.. ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలపై అభిమానులకు లెచ్చరించిన ఈనా తాజాగా డోంట్ వన్ పేరుతో మరొకసారి పూరి మ్యూజింగ్ లో చెప్పకు వచ్చారు..
ఈ సందర్భంగా మాట్లాడిన పూరి జగన్నాథ్.. “బుద్దుడు సర్వసంగ పరిత్యాగి, ఏది నాదని అనుకోవద్దని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్నీ వినలేం కదా. బ్యాంక్ బ్యాలెన్స్, ఇళ్లు, కారు ఉండాలనుకుంటాం. దేనినైనా సొంతం చేసుకోండి. కానీ మనిషిని కాదు. ఈ వ్యక్తి నా ఆస్తి అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి ఫస్ట్ స్టెప్ ప్రేమ. లవ్ పేరుతో ఈ వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దీంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు, రాను రాను మీ ప్రేమ వాళ్లకి వేదింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి, రహస్యాలన్నీ మనతోనే పంచుకోవాలని అనుకుంటారు. మీది అలాంటి ప్రేమైతే దయజేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమ అనేది ఒక ఛాయిస్ మాత్రమే, అంతేకాని అది అవసరం కాదు..” అన్నారు.. అలాగే `మనందరం భూమ్మీదకు టూర్ కోసం వచ్చాం. టూరిస్ట్ లా ఉందాం. చూద్దాం. ఎంజాయ్ చేద్దాం, టూర్ పూర్తికాగానే వెళ్లిపోదాం, అంతేకానీ నీతోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్దని.. ఈ వ్యక్తి నా ఆస్తి అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి ఫస్ట్ స్టెప్ ప్రేమ. లవ్ పేరుతో ఈ వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దీంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు, రాను రాను మీ ప్రేమ వాళ్లకి వేదింపుగా మారుతుంది..’ తెలిపారు..