Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత 53వ చలన చిత్రోత్సవ వేడుకలు ఇటీవల గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 28 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరయ్యారు. కాగా ఫిల్మ్ ఫెస్టివల్ లో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 150 పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవిని 2022 గాను “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా ప్రకటించింది.
ఈ క్రమం లోనే పవన్ తనతో పాటు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ దీన్ని అధికారికంగా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో… అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను.
భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవలే చిరంజీవి తన కాలేజీ ‘గెట్ టు గెథెర్’ ప్రోగ్రామ్ లో “పవన్ రాజకీయాలకు తగినవాడు” అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వెంటనే ఇప్పుడు పవన్ తన అన్నయ్యను అభినందనలు తెలపడం చూస్తుంటే సినీ, రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.