Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ” ఆదిపురుష్ ” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో… స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావుణాసురుడి పాత్రలో కనిపిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా ఇటీవల అక్టోబర్ 2న అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. నెటిజన్స్ అందరు ఈ సినిమాను రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించి ఎలా తెరకెక్కిస్తారంటూ దర్శకుడు ఓం రౌత్ పై విమర్శలు చేశారు. ఐతే, ఈ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ పై విమర్శలు వచ్చినా.. సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుందని… డైరెక్టర్ ఓంరౌత్ తెలిపారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12 రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆది పురుష్ వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిత్రాలతో పాటు కోలీవుడ్ హీరో దళపతి విజయ్ చేస్తోన్న వారసుడు సినిమా కూడా పోటీలో ఉంది. దీంతో ఈ సినిమాను సమ్మర్ బరిలో నిలిపేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అని…