Entertainment గత కొన్ని నెలలుగా ప్రభాస్-మారుతి సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తాజాగా చిత్రబృందం షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలేవి కూడా బయటకు రానివ్వకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతుంది. ఈ చిత్రానికి రాజాడిలక్స్ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలనలో ఉంచింనట్లు టాక్.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ఇప్పటికే మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా కన్ఫార్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఫిక్సయిందట. లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రిద్దీ కుమార్‌ను మూడో హీరోయిన్‌గా మేకర్స్ అనుకుంటున్నారట. ఇక ఇటీవలే రాధేశ్యామ్‌లోనూ ఈమె తారా పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో ఆర్చర్ అవ్వాలనుకున్న రిద్ధీ ట్రైన్ యాక్సిడెంట్‌లో చేయి పోగోట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌కు జోడీగా చేయనుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్రర్ కమెడీ నేపథ్యంలో ఇది రూపొందనున్నట్లు ప్రచారం సాగుతోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.