Emtertainment కొందరు హీరోలు ఎంత మంచి స్థాయిలో ఉన్నా ఏమాత్రం గర్వం లేకుండా తమ మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. వీరికి సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా ఎందరో అభిమానులు ఉంటారు. ఇలాంటి వారిలో ఒక్కడే మన డార్లింగ్ ప్రభాస్. గతవారం ప్రభాస్ పెదనాన్న మన టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 29న ఆయన స్మారక సభను ఆయన స్వస్థలమైన మొగల్తూరులో ఏర్పాటు చేయనున్నారు. ఆరోజున వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఏకంగా 70000 మందికి ఈ సందర్భంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ గొప్ప మనసు మరోసారి చర్చనీయంశం అయింది.
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం అంటేనే అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ప్రభాస్ భోజనానికి పిలిస్తే ఎంతో ప్రేమగా చూసుకోవడమే కాకుండా ఎన్నో రకాల వంటకాలు పెడతారని చెప్తుంటారు. మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ ఆతిథ్యానికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశక్తి కాదు. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు గారి స్మారక సభకు వస్తున్న వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు ప్రభాస్. వీళ్ళ స్వస్థలమైన భీమవరం మొగల్తూరులో సెప్టెంబర్ 29న జరగబోయే ఈ కార్యక్రమానికి దాదాపు 70000 మంది వస్తారని.. వీళ్ళందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయమన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రభాస్ పెద్ద మనసుని పొగడకుండా ఉండలేకపోతున్నారు. రాజులంటే ఇలానే ఉంటారేమో అని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు..






















