Prasad Imax : హైదరాబాద్ లోని మూవీ లవర్స్ కు ప్రసాద్స్ ఐమాక్స్ ఓ శుభవార్త చెబుతుంది. నెక్లెస్ రోడ్డులో ఉండే ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్‌కు హైదరాబాద్‌లో మంచి పేరు ఉంది. ఇక్కడ సినిమాలు చూసేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. దేశంలోనే అతి పెద్ద సినిమా స్క్రీన్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ స్క్రీన్‌లో సినిమాలను ప్రదర్శించనున్నారు. 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఈ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్క్రీన్‌గా ఇది నిలవనుందని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చెబుతోంది. కాగా ఈ మేరకు ప్రసాద్ సినిమాస్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్ కుమార్ ఈ పెద్ద స్క్రీన్‌కి సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఆ పోస్ట్ లో… ఇప్పటికే ఈ స్క్రీన్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మోహన్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రపంచస్థాయి అనుభవాన్ని తీసుకురావడానికి మీరు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని, దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఉండే ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ బిగ్ స్క్రీన్‌లో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఆ స్క్రీన్ హైదరాబాద్‌లోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ త్వరలో ప్రసాద్స్ ఐమాక్స్‌లో అందుబాటులోకి రానుండటంపై సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.