బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై విరుచుకుపడింది మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. ప్రియాంక చోప్రా అందంగా ఉండదని, అసలు ఆమె అందగత్తే కాదని కేవలం ఫేవరెటిజం వల్లే 2000లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ అయిన ఏడాది జరిగిన పోటీల గురించి మాట్లాడుతూ లెయ్‌లానీ మెకనీ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
1999, 2000 రెండు ఏడాదిల్లోనూ భారత్‌కే మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. అయితే 2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో స్పాన్సర్లు భారత్‌కు చెందిన వారు కావడంతో భారత్‌కు చాలా ఫెవరెటీజం జరిగిందని లెయ్‌లానీ మెకనీ ఆరోపించింది. ఈమె కూడా 2000లో జరిగిన పోటీల్లో పాల్గొందట. ప్రియాంక ఆ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఒక్క రిహార్సల్స్‌లోనూ పార్టిసిపేట్ చేయలేదని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ప్రియాంకను అందరూ స్పెషల్‌గా చూసేవారని, ఆమెకు భోజనం కూడా తన రూమ్‌కే తీసుకెళ్లేవారని, మిగతా వారికి అలా ఉండేది కాదని చెప్పింది. ప్రియాంకకు ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసేవారని, ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులు ఇచ్చేవారని వాపోయింది. అందుకే ప్రియాంకకు మిస్ వరల్డ్ వరించిందని వ్యాఖ్యానించింది.