ప్రొటీన్ ఫుడ్ అనగానే అందరూ మాంసాహారంలోనే ఉంటుందనుకుంటారు. చికెన్, మటన్, ఫిష్ ఇతరత్రా నాన్‌వెజ్ ఫుడ్‌లోనే ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని భావించి తెగ లాగించేస్తుంటారు. కానీ వెజ్‌ఫుడ్‌లోనూ కావాల్సినంత ప్రొటీన్ ఉంటుంది. రోజూ అవసరమైన మోతాదులో తీసుకుంటే నాన్‌వెజ్ స్థాయిలో వెజ్‌లోనూ ప్రొటీన్ అందుతుంది.
బాదం, జీడిపప్పు, కొర్రలు, సామలు, చిరు ధాన్యాలతో పాటు శనగలు, కందుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందట. 100 గ్రాముల బాదం తీసుకుంటే అందులో 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని తేలింది. ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, చీజ్, రాగులు, సొయాబీన్స్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రొటీన్ ఫుడ్ అంటే నాన్‌వెజ్ మాత్రమే అనే అపోహ నుంచి బయటకు వచ్చి ఎంచక్కా వెజ్ ఫుడ్‌ను కూడా ఎంజాయ్ చేస్తూ లాగించేయొచ్చు.