Quthbullapur MLA KP Vivekananda Goud, MLC Shambipur Raju Opend New TRS KV Flag
టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్మికులంతా ఐకమత్యంగా ఉంటూ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే యాజమాన్యాలతో చర్చించి వాటి పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, మాజీ కౌన్సిలర్ రంగారావు, నాయకులు శ్రీనివాస్, రాజు, యూనియన్ జనరల్ సెక్రెటరీ డి.రసూల్, జాయింట్ సెక్రటరీ రవికిరణ్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.జోగారావు, ట్రెజరర్ శ్రీనివాస్ మరియు కార్మికులు పాల్గొన్నారు.