ఈరోజు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం (నేరేడ్ మెట్) నందు డాక్టర్ తరుణ్ జోషి, ఐపిఎస్., రాచకొండ పోలీసు కమిషనర్ గారు అనారోగ్యంతో మరిణించిన వలిగొండ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నూకల నర్సిరెడ్డి బార్య పద్మకు భద్రత నుండి 7 లక్షల 88 వేయుల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. వీరికి పెన్షన్, మిగతా బెనిఫిట్స్ త్వరగా వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపి గారు సంబంధిత అదికారులను ఆదేశించారు.
సిబ్బంది యొక్క పెండింగ్ బిల్లుల గురించి చెప్పగా, సానుకూలంగా స్పందించారు. ఆర్ధిక సంబంధిత అధికారులతో మాట్లాడి బిల్లులను పాస్ చేపిస్తనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.