Rachakonda News : జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్ పేట సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ… యోగా అనేది ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. యోగా సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖలో తీవ్రమైన ఒత్తిడి మధ్య అహర్నిశలు పనిచేసే సిబ్బందికి యోగా సాధన ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది తమ వీలును బట్టి తప్పనిసరిగా యోగా సాధన చేయాలని సూచించారు.
రాచకొండ డిసిపిలు, అదనపు డిసిపిలు మరియు హెడ్ క్వార్టర్స్ లోని పలు స్థాయిల అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో యోగా సాధన చేయడం జరిగింది.