Raghu Rama Krishnam Raju Case, Army Hospital Medical Report, YSRCP Sajjala Ramakrishna Reddy, AP Poltical News,
రఘురామకృష్ణరాజును పోలీసులు మైక్రో లెవల్‌లో కాలి వేలి దగ్గర గాయం చేయగలరా? అది సాధ్యమా?: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
* సుప్రీంకోర్ట్‌లో ఎంపి రఘురామకృష్ణరాజు కు సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్నది హైడ్రామా. సిఐడి పెట్టిన రాజద్రోహం కేసు, ఆయన కాలికి గాయం అయ్యిందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన పరీక్షల్లో నివేదిక సుప్రీంకోర్ట్ కు చేరింది. రఘురామకృష్ణరాజు చేసిన దుర్భాషలు, రెచ్చగొట్టేరకంగా చేసిన వ్యాఖ్యలను 124A కింద తీసుకుని పెట్టిన ఎఫ్‌ఐఆర్, ఇతర దర్యాప్తు ప్రక్రియలో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడిందని భావిస్తున్నాం. హద్దూపద్దూ లేకుండా ఎవరైనా సరే చేస్తున్న వ్యాఖ్యలు, సమాజంలోని వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించకుండా ఈ ఉదంతం కనువిప్పు కలిగిస్తుంది. మా ప్రభుత్వానికి వ్యక్తిగత ద్వేషాలు లేవు. పాజిటీవ్ దృక్పథంలో ప్రజల మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాం. జగన్ గారు ఎవరినీ ప్రత్యర్ధులుగా, శత్రువులుగా భావించడం లేదు. పరిధి దాటితే దాని పరిణామాలను చట్టపరిధిలో ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండేళ్లు అయినా ప్రత్యర్థి పార్టీలు తమ అనుకూల మీడియా ద్వారా చేయిస్తున్న కుట్రలు, దుష్ర్రపచారాలు, పట్టించుకోకుండా జగన్ గారు తమ పనితాము చేసకుంటూ పోతున్నారు. ప్రజల సంక్షేమం పైనే దృష్టి పెట్టారు.
* ప్రాథమిక సాక్ష్యాలు ఉండటం వల్లే అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ళ నరేంద్ర, కొల్లు రవీంద్రల మీద కేసులు నమోదయ్యాయి. అంతేకానీ ఎవరిపైన అయినా వ్యక్తిగత కక్షతో, ఆధారాలు లేకుండా కేసులు పెట్టించే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం హయాంలో శ్రీ వైయస్ జగన్ పై ఎన్ని అబద్ధపు కేసులు బనాయించారో అందరికీ తెలుసు. కానీ మేం అటువంటి విధానాలకు దూరం. రఘురామకృష్ణరాజును రమేష్ ఆసుపత్రికి పంపాలని ఏ బేసిస్‌పై అడుగుతున్నారు? ఆ ఆసుప్రతి యాజమాన్యం టిడిపి అనుకూల వ్యక్తులది. అక్కడికే ఎందుకు తీసుకువెళ్ళాలనే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఆ ఆసుపత్రికి పోకపోవడమే నేరం అయినట్లు మాట్లాడటం టిడిపి వారి బరితెగింపుతనం. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి అది. కమర్షియల్‌గా వ్యాపారం చేసుకుంటున్న, కేసులు ఉన్న ఆసుపత్రి అది. దానిని గురించి ప్రశ్నించడం ఆశ్చర్యం వేస్తోంది. చట్టప్రకారమే సిఐడి చర్యలు తీసుకుంది.
* తెలుగుదేశంకు ఏ వ్యవస్థలు, ఏ శక్తులు వారికి అండగా ఉన్నాయో అందరికీ తెలుసు. వారుచేస్తున్నదే సరైనదనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు హైకోర్ట్ బెయిల్‌కు పోయిన సందర్బంలోనూ టార్చర్ అనే మాట లేదు, బెయిల్ రాకపోవడంతో టార్చర్ చేశారనే వాదనకు తెరతీశారు. వారి అడ్వోకేట్ రిక్వెస్ట్ మీద ఆయనను మెడికల్ బోర్ట్ ముందుకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించాము. మేజిస్ట్రేట్ కోర్ట్‌లో రమేష్ హాస్పటల్స్‌కు తీసుకువెళ్ళాలని వాళ్ళు కోరతారు. ఎందుకు రమేష్ ఆసుపత్రికే తీసుకుపోవాలి? ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లాలని అడుగుతారు? అదేమైన ఛారిటీతో మంచిపేరు ఉన్న ఆసుపత్రి కాదు. ప్రభుత్వ ఆసుపత్రిపైన విశ్వాసం లేదని ఎలా అంటారు? కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సీఎం గారికి ఎలా ముడిపెట్టి ఆరోపణలు చేస్తారు? ఇందులో ఎక్కడ హేతుబద్దత ఉంది?
* ప్రతిపక్షంగా మీ కక్షసాధింపు మాపైన ఎక్కువ అయ్యింది. పవర్‌ను వెనుక నుంచి నడపడం తెలిసిన వారు, మీడియా బలం చూసుకుని, మా ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో నిజంగానే సఫలీకృతం అవుతున్నారని అనిపిస్తోంది. అయినా కూడా నిబ్బరంగా అన్నింటిని ఎదుర్కొంటాం. ప్రజల దీవెనలు మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఉన్నాయి. రోజురోజుకు జగన్ గారి పట్ల ఆదరణ పెరుగుతోంది.
* రఘురామకృష్ణరాజును పోలీసులు మైక్రో లెవల్‌లో కాలి వేలి దగ్గర గాయం చేయగలరా? అది సాధ్యమా? నిజంగా ఫ్యాక్చర్ అయి ఉంటే వాపు వస్తుంది, కనీసం నడవలేరు. కారులో వెళుతూ కూడా ఆయన కాలు పైకి ఎత్తి చూపారు, కోర్ట్‌కు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా ఫ్యాక్చర్ అయితే చాలా నొప్పి ఉంటుంది. అటువంటి ఛాయలు ఎక్కడా లేదు. ఆయనపై ఎటువంటి టార్చర్ జరగలేదు, అటువంటి అవకాశం కూడా లేదు, ఒక ఎంపీని పనికట్టుకుని పోలీసులు వ్యక్తగత కసితో దాడి ఎందుకు చేస్తారు? మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఎటువంటివి జరగలేదు. బెయిల్ రద్దు కావడంతో ఈ డ్రామకు తెరలేపారు. అదికూడా చంద్రబాబు డైరెక్షన్‌లోనే ప్రారంభించారు. ఈ కుట్ర కేసులో ఆధారాలతో సహా దొరికిపోతామనే భయం వారిలో ఉంది. మేం ప్లెయిన్‌గా ఉంటున్నాం, వారు కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా తమ తెలివితేటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.