Rahul Ramakrishna : టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆయన కామెడీ టైమింగ్ కి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ” అర్జున్ రెడ్డి ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రాహుల్. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతూ… ‘గీతా గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కాగా ఇటీవలే తన స్నేహితురాలు హరితను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాహుల్ ప్రకటించాడు.
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు రాహుల్. అయితే తాజాగా అతను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ యంగ్ కమెడియన్. తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కాగా వీరిద్దరికి పెళ్లి ఎప్పుడు అయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వీరిద్దరి పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన గాని, దాని గురించి ఎటువంటి వార్త గాని వినిపించకపోవడం, హఠాత్తుగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఆ పోస్ట్ ని ఉద్దేశిస్తూ… సహజీవనం చేస్తుండచ్చు అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం పెళ్లి గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ పలువురు ప్రముఖులు, అభిమానులు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
https://twitter.com/eyrahul/status/1589413894904500225?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1589413894904500225%7Ctwgr%5E28649534dcce6f30c4d86a60bfb4993350a4bab6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Ftollywood-star-comedian-rahul-ramakrishna-going-to-be-a-father-525596.html