Viral సాధారణంగా మనం నిత్యం ఎన్నో రకాల పాములను చూసే ఉంటాం. వాటి గురించి వినే ఉంటాం. అయితే ఒక్కో జాతికి చెందిన పాములు ఒక్కో విధమైన రంగును పోలి ఉంటాయి. కొన్ని చూడటానికి ఇంకా ఉంటే మరికొన్ని విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.. అలా మీరు ఎప్పుడైనా ఇంద్రధనస్సు రంగును పోలి ఉన్నటువంటి పామును చూశారా.. ఏంటి పాము ఇంద్రధనుసు రంగులలో ఉండటమా అని ఆశ్చర్యపోతున్నారా.. దాని గురించే తెలుసుకుందాము..
కాలిఫోర్నియాలో పాముల కోసం ప్రత్యేకంగా సరీసృపాల జూ ఏర్పాటు చేసిన జయ్ బ్రెవర్.. ఇందులో ఎన్నో రకాలైన పాములు ఉన్నాయి.. అందులో తన వద్ద ఉన్న వివిధ రంగుల కలిగినటువంటి ఓ అరుదైన పాముతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాము పై సూర్యరశ్మి పడగానే అది ఇంద్రధనస్సులో ఉన్నటువంటి రంగులతో ఎంతో కాంతివంతంగా మెరుస్తూ కనబడుతోంది. అందుకే ఈ పామును రెయిన్ బో స్నేక్ అని పిలుస్తారు. ఈ వీడియోను అతడు గతంలోనే పోస్ట్ చేశాడు. అయితే అది ఇప్పుడు మళ్లీ వైరల్ అయింది.
ఈ విధంగా రంగులు కలిగినటువంటి రెయిన్ బో పాము శాస్త్రీయ నామం ‘ఫరాన్సియా ఎరిత్రోగా’ అని బ్రెవర్ వివరించాడు. అయితే ఇది విషపూరితమైన పాము కాదని దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపాడు… ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.