Entertainment జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో చేపట్టిన జనాలని కార్యక్రమంలో జనసేన సైనికుల్ని అరెస్టు చేశారు పోలీసులు అయితే ఈ విషయంపై కోపంతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే తనను పదేపదే టార్గెట్ చేస్తూ ప్యాకేజి స్టార్ అంటున్న వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంతేకాకుండా నా కొడకల్లారా అంటూ తన కాలు చెప్పు తీసి చూపించారు తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు..
విశాఖపట్నంలో జరిగిన సంఘటనలు అనంతరం జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అంతేకాకుండా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుర్తించారు తన వ్యక్తిగత జీవితం జోలికి రావద్దంటూ హెచ్చరించారు అంతేకాకుండా అంత అవసరం ఉంటే తనలాగే మిగిలిన వాళ్ళు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోమని అన్నారు.. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఏపీ రాజకీయాల్లో రాబోతున్న మార్పునకు సూచికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన రాంగోపాల్ వర్మ గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావంవంతమైన స్పీచ్లో ఇదొకటి అంటూ పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తారు…అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కళ్యాణ్‌ది అన్న వర్మ.. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదన్నారు. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయన్నారు. మంచి వాక్పటిమతో ఉన్న జనసేనాని స్పీచ్ ఎప్పుడూ జనాలను కదిలిస్తుందన్నారు.