Prabhas-Rana Daggubati : ఓ హీరో సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందని మరో హీరో మీడియా ముఖంగా ప్రశంసించటం అరుదైన విషయమే అని చెప్పాలి. ఇప్పుడున్న ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్‌లో ఓ హీరో సినిమాను మరో హీరో అప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) తన స్నేహితుడైన ప్రభాస్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇంతకీ అంతలా రానా పొగిడిన ప్రభాస్ సినిమా ఏదో తెలుసా.. ‘ప్రాజెక్ట్ K’. ఇటీవల ఇంటర్వ్యూలో రానా సౌత్ ఇండియన్ సినిమా.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా సక్సెస్ వెనుకున్న సీక్రెట్ గురించి మాట్లాడుతూ ..
‘‘మేం అందరం అన్నీ సినిమాలను ఎంకరేజ్ చేసుకుంటాం. సినిమాను సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్ట్స్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమా కోసం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి వారు నటించారు. ఈ సినిమా బాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. కచ్చితంగా సినిమా ఇప్పటి వరకు ఉన్న హద్దులను చెరిపేసి కొత్త హద్దులను క్రియేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఈ జూన్ 16న ‘ఆది పురుష్’ (Adipurush) సినిమా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ (salaar) మూవీ రానుంది. ఆ తర్వాతనే ‘ప్రాజెక్ట్ K’ (Project K) రానుంది. ఈ చిత్రం జనవరి 12న భారీ రేంజ్‌లో రిలీజ్ కానుంది. అది కూడా పాన్ ఇండియా మూవీగా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనూ రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు రెండు, మూడు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తుంటే ‘ప్రాజెక్ట్ K’ సరికొత్తగా ఉండనుందని అర్థమవుతుంది.